Sunke Ravishankar | గంగాధర, జులై 12 : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గంగాధర మండలం బూరుగుపల్లి లో శనివారం గంగాధర మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించేలా కృషి చేయాలన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వం హాయంలో చేసిన అభివృద్ధి, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఆయంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని, గ్రామాల్లో చర్చ పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. వార్డు మెంబర్ నుండి ఎంపీపీ,, జెడ్పీటీసీ వరకు బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్త కష్టపడి పని చేయాలని, పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గంగాధర సింగిల్ విండో చైర్మన్ దూలం బాలగౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, నాయకులు కంకణాల విజయేందర్ రెడ్డి, మడ్లపల్లి గంగాధర్, ఎండి నజీర్, వేముల దామోదర్,వడ్లూరి ఆదిమల్లు, జోగు లక్ష్మీరాజం, ఆకుల మధుసూదన్, ఆకుల శంకరయ్య, బొల్లాడి శ్రీనివాస్ రెడ్డి, మామిడిపల్లి అఖిల్, నిమ్మనవేని ప్రభాకర్, తిరుమల సుధాకర్, రేగుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.