Urban cleanliness | పెద్దపల్లి, మే31: పెద్దపల్లి పట్టణాన్ని క్లిన్ అండ్ గ్రీన్‌గా మార్చటంలో పట్టణవాసులందదరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్ కోరారు. 27వ వార్డ్ శుభాష్నగర్లో తడి పొడి చెత్తపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి రోజు ఇంట్లో వెలుబడే చెత్తను ఎక్కడ పడితే పారవేయకుండా తడి, పొడి చెత్తగా వేరుచేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు.
చెత్తను శుక్ర, మంగళవారం మాత్రమే సేకరిస్తారని, తడి చెత్తను ప్రతిరోజు సేకరిస్తారని స్ఫష్టం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, సీసాలు నిలువచేసి మున్సిపల్ సిబ్బందికి అందచేయాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. చెత్త చెదారం, ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్, సీసాలు రోడ్డుపై గానీ, మురికికాలువలో గానీ వేసినట్లయితే జరిమాన విధిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్లు అనూష, అశ్విత, నవ్య ప్రణీత, అనూష, కుమార్, శ్రీనివాస్, ప్రదీప్, అనిల్, సుధీర్, అరవింద్, సంజీవ్, యశ్వంత్, హరీష్, శానిటరీ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రెడ్డి, జవాన్ జయరాజ్, మెప్మా ఆర్పీ వునుకొండ లక్ష్మి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.