local elections | ధర్మారం, జూలై 31 : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడానికి పార్టీ శ్రేణులు సమైక్యంగా కృషి చేయాలని నంది మేడారం pacs చైర్మన్, సహకార సంఘాల ఫోరం జిల్లా చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు గురువారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం గోపాల్ రావు పేట, సాయంపేట గ్రామాలలో పార్టీ సమన్వయ ప్రత్యేక సమావేశాలు పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశాలకు భారీ స్పందన లభించింది. ఆయా గ్రామాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఆయా గ్రామాలలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పంజాల శ్రీనివాస్, బొలిశెట్టి సుధాకర్ గులాబీ జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు, నినాదాలతో హోరెత్తించారు. ఈ సమావేశాలలో ప్యాక్స్ చైర్మన్ బలరాం రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా సమన్వయ సమావేశాలను నిర్వహిస్తున్నామని అన్నారు. పార్టీ నిర్దేశించిన ప్రకారం అందరూ సమైక్యంగా ఉండి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాలని ఆయన సూచించారు. ఇప్పటివరకు పార్టీ చెక్కుచెదరకుండా పార్టీ కార్యకర్తలు నాయకులంతా అన్ని గ్రామాలలో ఐక్యంగా ఉండడం ఎంతో అభినందనీయమని అన్నారు. గతంలో పార్టీలో కొనసాగి ఎంతో లాభపడి ఇతర పార్టీలకు వలస వెళ్లిన వారితో ఎలాంటి నష్టం ఉండదని ప్రస్తుతం ఉన్న కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలని వారికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన ప్రాధాన్యత ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
మండల వ్యాప్తంగా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని అందరూ పార్టీ ఏజెండాను అనుసరించి రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు క్రమశిక్షణతో నడుచుకుంటున్నారనే విషయాన్ని అందరూ గ్రహించాలని ఆయన సూచించారు. గత బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు పార్టీ శ్రేణులు వివరించాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనిస్తున్నారని, ప్రస్తుతం మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలలో ఆలోచన మొదలైందని ఆయన అన్నారు. గ్రామ గ్రామాన అందరూ సమైక్యంగా కృషి చేసే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన సత్తా చాటడం జరిగిందని , ఈసారి కూడా అది సాధ్యమవుతుందనే విషయాన్ని అందరూ గ్రహించాలని బలరాం రెడ్డి తెలిపారు.
పత్తిపాక సింగిల్ విండో చైర్మన్ నోముల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో కార్యకర్తలు అందరూ సమిష్టిగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేసే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీల నుంచి ప్రజలను మోసం చేస్తూ పాలన కొనసాగిస్తున్నదని విమర్శించారు. ప్రస్తుతం ప్రజలు ఆ పార్టీ నమ్మే ప్రసక్తే లేదని అన్నారు.
ఈ సమావేశాలలో ప్యాక్స్ వైస్ చైర్మన్ సామంతుల రాజ మల్లయ్య, డైరెక్టర్ భారత స్వామి, ఏఎంసీ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గుర్రం మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ కోమటిరెడ్డి మల్లారెడ్డి, గోపాల్ రావు పేట మాజీ సర్పంచ్ జనగామ అంజయ్య, మాజీ ఉప సర్పంచులు సంకసాని సతీష్ రెడ్డి, బద్దం తిరుమల్ రెడ్డి, పార్టీ మండల నాయకులు పాక వెంకటేశం, పెంచాల రాజేశం, తుమ్మల రాంబాబు, దాడి సదయ్య, మిట్ట తిరుపతి, మోతే సుజాత శ్రీనివాస్, ఎండీ రఫీ, సందినేని కొమురయ్య, మేకల రాజయ్య, జాడి రాజయ్య, సంకసాని తిరుపతిరెడ్డి, సుర కంటి సుజాత, శ్రీనివాసరెడ్డి, బద్దం లక్ పతి రెడ్డి, కూరపాటి శ్రీనివాస్, దొనికేని తిరుపతి, దేవి రమణ, సాన రాజేందర్, ఎగ్గేల స్వామి, కారుపాకల రాజయ్య, అయిత వెంకటస్వామి, ఆవుల శ్రీనివాస్, ఆవుల వేణు, రెడపాక శ్రీనివాస్, కాంపల్లి చంద్రశేఖర్, రాగుల చిన్న మల్లేశం, కాంపల్లి అపర్ణ, మార్క సంధ్య, నెల్లి విజయ, మర్రి మమత, ఈర్ల అనిత, అలవాల సరమ్మ తదితరులు తెలిపారు.