Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, అక్టోబర్ 1 : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వ పాఠశాలల్లో సవన్నా సీడ్ కంపెనీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు కంపెనీ మేనేజర్ రోహిత్ గుప్తా అన్నారు. సవన్నా సీడ్ కంపెనీ 16వ వార్షికోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని కస్తూరిభా గాంధీ పాఠశాలలో గురువారం మొక్కలు నాటారు.
అనంతరం పాఠశాల విద్యార్థునులకు పరీక్షా ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. నాటిన మొక్కలను సంరక్షించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్వో శ్రీదేవి, కంపెనీ సిబ్బంది వడ్లూరి సాగర్, శేఖర్, రాజు, కిరణ్, వెంకటేష్, సంతోష్, రమేశ్, ప్రవీణ్, అనిల్, వెంకట్రావు తదితరులు మాట్లాడారు.