APPANNAPETA | పెద్దపల్లి రూరల్, మార్చి 28 : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అప్పన్నపేట ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు చింతపండు సంపత్ అన్నారు. పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట సింగిల్ విండో కార్యాలయ ఆవరణలో సర్వసభ్యసమావేశం చైర్మన్ సంపత్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ రైతు కాసులపల్లికి చెందిన ఎర్రం మల్లారెడ్డి, వ్యవసాయ విస్తీర్ణాధికారి పూర్ణచందర్ ను శాలువాలు కప్పి మెమోంటోలతో సన్మానించారు. అనంతరం సంపత్ మాట్లాడుతూ.. రైతు ప్రయోజనాలకు అనుగుణంగా అప్పన్నపేట సొసైటీనీ అన్ని రంగాల్లో ముందుంచేలా రైతుల అవసరాలకు అనుగుణంగా నడిపిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పలు తీర్మాణాలు చేసి మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు ఏకగ్రీవంగా ఆమోదింపజేశారు. ఈ సమావేశంలో సీఈవో గడ్డి తిరుపతి, పలువురు డైరెక్టర్ పాల్గొన్నారు.