S Veeraiah | కోల్ సిటీ, జూన్ 23: ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దేశాలు జరుపుతున్న యుద్ధంను వెంటనే ఆపి శాంతిని నెలకొల్పాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు గోదావరిఖనిలోని పార్టీ కార్యాలయం నుంచి సోమవారం చేపట్టిన ర్యాలీ ప్రధాన చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ముఖ్యతిథిగా సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య హాజరై మాట్లాడుతూ ఇరాన్ దేశంలో రసాయనిక ఆయుధాలు, అణ్వాయుధాలు తయారు చేస్తున్నారరి ఆరోపణలు మోపి ఇజ్రాయెల్ బాంబులతో దాడులు చేస్తుందన్నారు. అమెరికా దేశం ఇరాన్ లో అణ్వాయుధాలు ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి సర్వే చేయిస్తే అలాంటిదేమి లేదని రిపోర్టు వచ్చిందనీ, అయినా అమెరికా కూడా ఇరాన్ పై యుద్ధం చేయడం సిగ్గుచేటన్నారు.
మొదట అణ్వాయుధాలు తయారు చేసిన దేశం అమెరికా అనీ. హిరోషిమా, నాగసాకి పై దాడి చేసింది అమెరికా దేశం అని గుర్తు చేశారు. యుద్ధం మొదలుపెట్టిన ఇజ్రాయెల్ దేశంను అమెరికా ప్రోత్సహించడం సరైంది కాదన్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగిన సందర్భంలో తానే యుద్ధంను ఆపానని ట్రంప్ చెప్పడం, దాన్ని మోడీ వ్యతిరేకించకపోవడం పైగా అమెరికా దేశం నుంచి వస్తువుల దిగుమతిపై సుంకాలు విధించవద్దని అమెరికా దేశ అధ్యక్షులు హెచ్చరించినా మోడీ మౌనంగా ఎందుకు ఉండాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి యాకయ్య, నాయకులు ముత్యంరావు, వేల్పుల కుమారస్వామి, మహేశ్వరి, రామాచారి, గణేష్, కొమురయ్య, జ్యోతి, భిక్షపతి, రవీందర్, శైలజ, నర్సయ్య, రాజిరెడ్డి, లక్ష్మారెడ్డి, నాగమణి, శివకుమార్, అరవింద్, సమ్మక్క, అనూష, నర్సింగరావు, రమ, లింగయ్య, వెంకటస్వామి కార్యకర్తలు పాల్గొన్నారు.