Won by toss | కోరుట్ల రూరల్ : కోరుట్ల మండలంలోని చిన్న మెట్పల్లి గ్రామంలో నాలుగో వార్డ్ లో ఇద్దరు పోటీ చేయగా సమాన ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల అధికారులు టాస్ వేసి గెలుపు నిర్ధారించారు. గ్రామంలోని నాలుగో వార్డులో 212 ఓటర్లు ఉండగా వార్డు సభ్యులుగా వెలమల తిరుపతి, బద్దం సతీష్ పోటీపడ్డారు.
172 మంది ఓటర్లు ఓటు పోలింగ్ కాగా ఇద్దరికీ సమానంగా 86 ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల అధికారులు అభ్యర్థుల సమక్షంలో ఎన్నికల నిబంధన ప్రకారం టాస్ వేసి వెలుమల తిరుపతి నాలుగో వార్డు సభ్యుడిగా గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.