Godavarikhani | కోల్ సిటీ, ఆగస్టు 13: గోదావరిఖని నగరంలోని శ్రీ కోదండ రామాలయం పరిసర ప్రాంతంలో కొద్ది రోజులుగా సంచరిస్తున్న గుర్తు తెలియని మహిళకు అధికారులు ఆశ్రయం కల్పించారు. స్థానికులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ మహిళ పరిస్థితిని గమనించి రామగుండం సీడీపీఓ అలేఖ్య పటేల్, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ బీ.స్వర్ణలతల దృష్టికి తీసుకవెళ్లడంతో బుధవారం ఆ ప్రాంతంకు చేరుకొని మహిళ వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు.
ప్రస్తుతం ఆ మహిళను ఈశ్వర కృప ఆశ్రమానికి తరలించినట్లు తెలిపారు. ఇక్కడ జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీ. భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు నసీమాతోపాటు స్థానికులు ఉన్నారు.