saidaapur | సైదాపూర్ : సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ తనయుడు బీఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు వొడితల ఇంద్రనీల్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఇంద్రనీల్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఉన్నత పదవులు పొందాలని కోరారు.
ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు పొతిరెడ్డి హరీష్, మాజీ సర్పంచ్ తాటిపెల్లి యుగంధర్ రెడ్డి, ఉప సర్పంచ్ కొమ్ముల రాజు, మాజీ ఎంపీటీసీ మట్టెల రవి, నాయకులు చాడ ఆదిరెడ్డి, పర్కలా నారాయణ, పర్శవేణి విజయ్, వేణు, కిషోర్, రమేష్, నరేష్, అఖిల్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.