Best Correspondent Award | మల్లాపూర్ డిసెంబర్ 15: ఈటి టెక్ ఎక్స్ ఎక్స్పో బ్రెయిన్ ఫీడ్ కార్యక్రమం స్కూల్ ఫస్ట్ యాప్, ట్రస్మా సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 13న హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎక్స్పోను ఆరంభించారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ వికాస్ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ సింగరపు అశోక్ కి స్కూల్ ఆఫ్ ఎక్స్టెన్స్ అవార్డు అందజేశారు.
సింగరపు అశోక్ రాష్ట్ర సలహాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ట్రస్మా సభ్యులు వారిని అభినందించారు. ఈ కార్యక్రమాలు నిసా సలహాదారు డాక్టర్ జేఎస్ పరంజ్యోతి, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి, గౌరవాధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు పాల్గొన్నారు. సింగరపు అశోక్ గత 25 ఏళ్లుగా మల్లాపూర్ మండల కేంద్రంలో పాఠశాల నడుపుతూ విద్యారంగంలో కృషి చేస్తూ ఉన్నారు. వీరి వద్ద చదువుకున్న వారు ఎందరో విద్యార్థులు ఉన్నత స్థానాలలో స్థిరపడ్డారు. గతంలో అశోక్ ఎన్నో పలు పురస్కారాలను అందుకున్నారు.