విద్యార్థులను వేధించవద్దు
శాతవాహన యూనివర్సిటీలో దివ్యాంగుడైన విద్యార్థి నర్సయ్యను పరీక్ష రాయడానికి అనమతించకపోవడంపై విద్యార్థులు మూడో రోజు శుక్రవారం తరగతి గదిలో శాంతియుతంగా నిరసన తెలిపారు.
- ఎస్‌యూ జేఏసీ నాయకులు
- సమస్యలపై మాజీ ఎంపీ వినోద్ కుమార్‌కు వినతి
- సమస్యలపై పోరాడాలని బీఆర్ఎస్ నాయకులకు వినోద్ ఆదేశం
కరీంనగర్ కమాన్‌చౌరస్తా, ఫిబ్రవరి 20 : శాతవాహన యూనివర్సిటీలో దివ్యాంగుడైన విద్యార్థి నర్సయ్యను పరీక్ష రాయడానికి అనమతించకపోవడంపై విద్యార్థులు మూడో రోజు శుక్రవారం తరగతి గదిలో శాంతియుతంగా నిరసన తెలిపారు. హాజరు శాతం పేరిట వేధించడం ఆపాలని ఎస్‌యూ జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. తర్వాత మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తామందరం అటెండెన్స్ పూర్తిగా మెయింటన్ చేసినప్పటికీ, విద్యార్థులపై ఒత్తిడి తెస్తూ బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. అటెండెన్స్ పేరుతో విద్యార్థులను వేధించడం సరికాదని హితవు పలికారు.
ఈ సమస్యను మాజీ ఎంపీ వినోద్ కుమార్‌కు వివరించినట్లు తెలిపారు. ఈ అంశంపై యూజీసీకి, ఐజీఏఎస్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్‌కు అధికారికంగా వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. న్యాయం జరిగే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. వినోద్‌కుమార్ స్పందిస్తూ వీసీ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థుల సమస్యలపై పోరాడాలని, వెంటనే యూనివర్సిటీకి పార్టీ బృందం వెళ్లాలని పరిష్కారం కోసం కృషి చేయాలని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్‌గౌడ్‌ను ఆదేశించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

