Dasari Manohar Reddy | పెద్దపల్లి రూరల్ డిసెంబర్ 24 : ప్రజలకు నిబద్దతో కూడిన సేవలందించి మంచి పేరు తెచ్చుకోవాలని, గ్రామస్తుల మన్ననలు పొందేలా గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేలా ముందుకు సాగాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు.
పెద్దపెల్లి మండలం మూలసాల గ్రామానికి నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్ జూపాక శ్వేత-వెంకటేష్ దంపతులు వార్డు సభ్యులు స్థానిక నాయకులతో కలిసి బుధవారం జిల్లా కేంద్రంలోని నివాసంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మూలసాల గ్రామ సర్పంచ్ జూపాక శ్వేత-వెంకటేష్ వార్డు సభ్యులను మాజీ ఎమ్మెల్యే దాసరి అభినందిస్తూ శాలువాలు కప్పి సన్మానించారు. ప్రజలకు నిబద్ధతతో సేవలు అందిస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ మందల సరోజిని రాంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కొయ్యడ శ్రీనివాస్, వార్డు సభ్యులు మల్లయ్య, ప్రవీణ్, నరేష్, వంశీ, విజయ, వేణు, తదితర నాయకులు పాల్గొన్నారు.