Chigurumamidi | చిగురుమామిడి, జనవరి 26 : చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలోని పెద్దమ్మ పల్లెలో స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని గ్రామస్తులు సర్పంచ్ అల్లెపు సంపత్, ఉపసర్పంచ్ బిల్లా సంతోష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అజయ్ కుమార్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు.
రేకొండ లో తాటి వనం వద్ద ఉన్న స్మశాన వాటికతో పెద్దమ్మ పల్లె ప్రజలకు సుమారు మూడు కిలో మీటర్లు శవంతో వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందని గ్రామస్తులు సర్పంచ్ కు తెలిపారు. పెద్దమ్మ పల్లెలో సబ్ స్టేషన్ సమీపాన గల డంపింగ్ యార్డ్ ను తొలగించి అట్టి ప్రదేశంలో స్మశాన వాటిక నిర్మాణానికి కృషి చేయాలని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో సింగిల్ విండో మాజీ డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి, వార్డు సభ్యులు కంప అశోక్, జినుకల అజయ్, చెంచల నాగరాజు, బోయిని అనిల్, సొసైటీ అధ్యక్షుడు మండల కొమురయ్య తదితరులున్నారు.