MLA Kavampally | తిమ్మాపూర్, ఆగస్టు 22: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం బాలయ్య పల్లె గ్రామపంచాయతీ పరిధిలో సాహెబ్ పల్లె, బాలయ్య పల్లెలు ఉన్నాయి. కాగా సాహెబ్ పల్లె వద్ద గ్రామపంచాయతీ నిర్మాణానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అడిషనల్ కలెక్టర్ అశ్విని, అధికారులు శంకుస్థాపన చేశారు. దీంతో బాలయ్య పల్లె గ్రామపంచాయతీ ని బాలయ్య పల్లెలో నే నిర్మించాలని పల్లెవాసుల డిమాండ్ చేశారు.
తమకు అన్ని విధాలుగా దూరమవుతుందని బాలయ్యపల్లి వాసులు మొదటి నుండి విన్నవిస్తున్నారు. అయినా సాహెబ్ పల్లెలోనే భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఫ్లకార్డులతో బాలయ్య పల్లె వాసులు నిరసన తెలిపారు. అంతేకాకుండా ఎమ్మెల్యే వాహనానికి అడ్డు తిరిగి నిరసన తెలిపారు. దీంతో కాంగ్రెస్ నాయకులు రంగంలోకి దిగి వారితో వాగ్వివాదం చేసుకున్నారు. దీంతో వారి మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి నిరసన వ్యక్తం చేసిన బాలయ్య పల్లె వాసులను అదుపులోకి తీసుకున్నారు.