Mallapur | మల్లాపూర్, జూన్ 23 : తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చేర్పించాలని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రత్నాపూర్ గ్రామస్తులు స్థానిక సర్పంచ్ గొండ రాజేందర్ ఆధ్వర్యంలో మంగళవారం ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, తదితర వసతులు ఉన్నాయని, గ్రామంలోని వీడీసీ, పాఠశాల పేరేంట్స్ కమిటీ, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులతో ప్రత్యేక సమావేశంను నిర్వహించి తమ పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో వేరే ప్రైవేట్ పాఠశాలల్లోకి పంపించమని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నల్ల రాజన్న, వీడీసీ, పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.