హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆ శాఖ కార్యదర్శి శ్రీధర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జలసౌధలో చీఫ్ ఇంజినీర్లు (సీఈలు), క్వాలిటీ కంట్రోల్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ప్రాజెక్టుల భద్రత, నాణ్యతపై అధికారులను నిలదీశారు.
చాలామంది అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా హైదరాబాద్, హెడ్ క్వార్టర్స్కే పరిమితమవుతున్నారని అసంతృప్తిని వ్యక్తంచేశారు. ముఖ్యంగా క్వాలిటీ కంట్రోల్ అధికారులు ప్రాజెక్టులను సందర్శించకుండా, అవసరమైన పరీక్షలు నిర్వహించకుండా కార్యాలయాల్లోనే ఉండటం సరికాదని హెచ్చరించారు.