Central government job | వీణవంక, సెప్టెంబర్ 1 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించి శిక్షణ పూర్తి చేసుకొని వచ్చిన యువకుడిని కొండపాక గ్రామస్తులు సోమవారం ఘనంగా సన్మానించారు. మండలంలోని కొండపాక గ్రామానికి చెందిన పానుగంటి పోశయ్య-శారద దంపతుల ప్రథమ పుత్రుడు పానుగంటి అభినవ్ సైనిక్ స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు విద్య పూర్తి చేసుకొని, హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేశాడు. ఇండియన్ నేవీలో ఉద్యోగం సాధించి, ఒడిస్సా రాష్ట్రంలో నాలుగు నెలలు శిక్షణ పూర్తి చేసుకొని ఇంటికి రాగా గ్రామస్థులు పెద్ద ఎత్తున ర్యాలీ తీసి, ఘనంగా స్వాగతం పలికారు.
శాలువాకప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు ఈదునూరి కుమార్ మాట్లాడుతూ యువత చెడువ్యసనాలకు బానిస కాకుండా ఉన్నత లక్ష్యాల వైపు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్, పూరెళ్ల కుమార్, అంబటి చందు, మిడిదొడ్డి మధు, కత్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు.