Kolanur | కొలనూరులో వైకుంఠ రథానికి గ్రామస్తుల విరాళం
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో విరాళాలతో కొనుగోలు చేసిన వైకుంఠ రథాన్ని గ్రామస్తులకు ఆదివారం అందజేశారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే స్మశాన వాటిక స్థలం వరకు వెళ్లడానికి అంతిమయాత్రకు ఇబ్బందులు పడుతున్నారు.
Kolanur | ఓదెల, ఏప్రిల్ 5 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో విరాళాలతో కొనుగోలు చేసిన వైకుంఠ రథాన్ని గ్రామస్తులకు ఆదివారం అందజేశారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే స్మశాన వాటిక స్థలం వరకు వెళ్లడానికి అంతిమయాత్రకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గ్రామంలోని కొందరు ‘మానవసేవయే మాధవ సేవ’ పేరా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వైకుంఠ రథానికి విరాళాలను సేకరించారు. విరాళాల రూపంలో వచ్చిన డబ్బులతో వైకుంఠ రథాన్ని కొనుగోలు చేసి ఆదివారం గ్రామస్తులకు అందజేశారు.
ఈ సమావేశంలో కరీంనగర్ కు చెందిన సామాజిక సేవకుడు, ప్రముఖ డాక్టర్ రఘురామన్ హాజరై విరాళాధాతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవలోనే సరైన తృప్తి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విరాళా దాతలతో పాటు నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులను శాలువాలతో సన్మానించారు. అలాగే ప్లాస్టిక్ నిషేధానికి బట్ట సంచులను డాక్టర్ రఘురామన్ అందజేసి, అవగాహన కల్పించారు. గ్రామంలో రూపాయి తీసుకోకుండానే వైకుంఠ రథం అందుబాటులో ఉంచుతామని గ్రామపంచాయతీ పాలకవర్గం తెలిపారు.
ఈ కార్యక్రమంలో యాదవ సంఘం రాష్ట్ర నాయకుడు కన్నెబోయిన ఓదెలు యాదవ్, సర్పంచ్ పల్లె కనకయ్య, ఉపసర్పంచ్ పాకాల సంపత్ రెడ్డి, శివాలయం చైర్మన్ కలకొండ చిన్న రాజిరెడ్డి, పాకాల కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బైరి రవి గౌడ్, మాజీ సర్పంచ్ మాటూరి వెంకటస్వామి, పెద్దపల్లి ఏఎంసీ డైరెక్టర్ కొల్లూరి చందు, రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దెల నరసయ్య, పత్తి బుచ్చిరెడ్డి, జంగం కొమురయ్య, ఆర్యవైశ్య సంఘ నాయకులు ముస్త్యాల శ్రీనివాస్, యాంసాని కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Donate
- Kolanur
- Odela
- Peddapally
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

