Fake medicines | కాల్వ శ్రీరాంపూర్ మే 5 : కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆశన్న పల్లి లో నకిలీ మందులు అమ్ముతున్న వ్యక్తులను గ్రామస్తులు సోమవారం పట్టుకున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలో సోమవారం ఉదయం సంజీవని న్యూట్రిషన్ కేర్ సెంటర్ న్యూట్రి అండ్ కౌన్సిలింగ్ నిర్వాహకులు కొంకటి రమేష్ అనే వ్యక్తి కొంతమంది వ్యక్తులతో కలిసి గ్రామంలో అమాయకులను ఆసరా చేసుకుని నకిలీ మందులు అంట కట్టాడు.
స్కానింగ్ పేరట రూ.200, మందుల కోసం రూ.1150 వసూలు చేసి మందులు ఇచ్చాడు. గ్రామస్తులకు అనుమానం వచ్చి ఆ మందులను తనిఖీ చేయగా అవి కాలం చెల్లిన మందులు అని, వాటిని పరిశీలించగా వాటిపై డేటు గడిచిపోయింది. వెంటనే గ్రామస్తులు. మాజీ సర్పంచ్ మంద రమా వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు కదులు రాజిరెడ్డి కూనారం వైద్యాధికారి డాక్టర్ బావనకు సమాచార ఇచ్చారు. దీంతో వెంటనే గ్రామానికి చేరుకొని మందులను పరిశీలించారు. వాటిని పరిశీలించగా అవి నకిలీ మందులుగా డాక్టర్ తేల్చారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ అమాయక ప్రజలను ఆసరా చేసుకుని నకిలీ మందులు అంటగట్టే మోసగాళ్లను నమ్మవద్దని గ్రామస్తులకు సూచించారు.
వీటిలో కాలం చెల్లిన మందులు ఉన్నాయని, ఇవి వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుందని ఆమె తెలిపారు . గ్రామస్తులకు ఇచ్చిన మందులను రికవరీ చేసి వారి వద్ద తీసుకున్న డబ్బులను గ్రామస్తులకు ఇప్పించారు. నకిలీ మందులను సీజ్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.