Chigurumamidi | చిగురుమామిడి, ఫిబ్రవరి 10: చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ఆదేశానుసారం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఫైనాన్షియల్ లిటరసీ వీక్ లో భాగంగా కేవైసీ పట్ల గ్రామస్తులకు ప్రత్యేక అవగాహన గ్రామ సర్పంచ్ బోయిని రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ముల్కనూర్ బ్రాంచ్ మేనేజర్ అరుణ్ హాజరై మాట్లాడుతూ కేవైసీ ని అప్డేట్ చేయడం, సికేవైసీ, మనీ మ్యూల్ గురించి అవగాహన కల్పించారు.
తెలియని లింకులతో కేవైసీని చేయవద్దని, సులభంగా వచ్చే డబ్బు కోసం తీసుకునే రిస్క్ ఎప్పుడు లాభదాయకం కాదన్నాని సూచించారు. సైబర్ నేరాల పట్ల గ్రామస్తులకు వివరించారు. బ్యాంకు అకౌంట్లు సైబర్ నేరాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది నితిన్, ఉప సర్పంచ్ పరుశరాములు, వార్డు సభ్యులు శ్రీనివాస్, జగన్, వివో ఏలు మాడ సరళ, వసంత గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.