Peddapally | పాలకుర్తి : గత కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాలకుర్తి మండలంలోని ఈసాలతక్కల్లపల్లి గ్రామానికి చెందిన గునిగంటి లింగయ్య పూరిల్లు తడిసి కూలిపోయింది.
దీంతో ఆ వృద్ధ దంపతులు నిస్సాహయక స్థితిలో బిక్కుబిక్కు మంటూ ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు, పాలకులు స్పందించి ప్రభుత్వ పరంగా తమకు ఇందిరమ్మి ఇల్లు కట్టించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.