Mallapur | మల్లాపూర్ ఆగస్టు 4 : జగిత్యాల జిల్లా మొగిలిపేట గ్రామంలోని ఏఆర్ఎస్ రైస్ మిల్లును రాష్ట్ర విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం నిల్వలు, మిల్లులోని సంబంధిత రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీలపై ఇంకా పూర్తిగా సమాచారం రావాల్సి ఉంది. మిల్లు సంబంధించిన రికార్డులను తనీకి వచ్చిన అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.