EMRS | ఎల్లారెడ్డిపేట, జూన్ 17: పదిహేనేండ్లుగా పని చేస్తున్న తమను ఎలాంటి బలమైన కారణం లేకుండా తొలగించడం అన్యాయమని ఇటీవల దుమాల ఈఎంఆర్ఎస్ నుంచి తొలగించిన సిబ్బంది పాఠశాల ముందు గడ్డిమందు డబ్బాతో నిరసన తెలిపారు. బాధితుల కథనం ప్రకారం.. పాఠశాలలో గత 15 ఏండ్ల నుంచి బాధ్యతగా పని చేస్తున్నామని అందులో తమ పిల్లలు కూడా చదువుతున్నారని అన్నారు. కొన్ని విషయాల్లో నార్త్ ఇండియా సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేసినందుకు తమను కక్షగట్టి తొలగించారని ఆరోపించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలెక్టర్ సందీప్‌కుమార్ కు పోన్ చేయించినా కలెక్టర్ ప్రిన్సిపాల్‌కు వత్తాసు పలుకుతున్నాడని ఆరోపించారు.
పోలీసులు ఎస్సై రమాకాంత్ ఆధ్వర్యంలో నిరసన సమాచారంతో పాఠశాల వద్దకు వెళ్లి బాధితుడి వద్ద నుండి గడ్డి మందు డబ్బాను తీసుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అనంతరం తొలగింపు పై ప్రిన్సిపాల్ మజీద్ తో మాట్లాడి నిరసన విరమింపజేసే ప్రయత్నం చేశారు. ఇది తెలుసుకున్న గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు గుగులోత్ సురేశ్‌నాయక్, బంజారా సంఘం నాయకులు తొలగించిన సిబ్బందిని మానవీయ కోణంలో ఆలోచించి తిరిగి నియమించుకోవాలని ప్రిన్సిపాల్‌ను కోరారు.
పాఠశాల ముందు బైఠాయించిన వారిలో ఏఎన్ఎం సుజాత, ల్యాబ్ అసిస్టెంట్ వంట మనిషి బాలు ఉన్నారు. దీనిపై ప్రిన్సిపాల్ మంజీత్‌ను వివరణ కోరగా ఈఎంఆర్ఎస్ ల జిల్లా స్థాయి ఎంపిక కమిటీ చైర్మన్‌గా కలెక్టర్ ఉంటాడని, సిబ్బంది పనితీరును బట్టి కలెక్టర్ ఆదేశాలతోనే పనితీరును బట్టి తొలగించామని, అవి ఔట్సోర్సింగ్ ఉద్యోగాలని నోటిఫికేషన్ వస్తే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.