Veterinary camps | చిగురుమామిడి, అక్టోబర్ 15: గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పశు వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్చార్జి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ లింగారెడ్డి అన్నారు. మండలంలోని చిన్న ముల్కనూరు గ్రామంలో పశు వైద్య శిబిరాన్ని బుధవారం ప్రారంభించారు.
జిల్లావ్యాప్తంగా పశువైద్య శిబిరాలను ఏర్పాటు జరిగిందని, అందులో భాగంగా చిగురుమామిడి మండలంలోని ముల్కనూరులో మొదటగా ప్రారంభం చేయడం జరిగిందన్నారు. గాలికుంటు వ్యాధి నివారణ చర్యలకు గాను ఇతరత్రా వ్యాధులను నివారించేందుకు పశువైద్య శిబిరాలు ఎంత దోహదపడతాయ న్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
మొదటిరోజు 161 పశువులు, 30 బర్ల కు వైద్య సేవలు చేయడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరంలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, చిగురుమామిడి, ఇందుర్తి మండల పశువైద్యాధికారులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సాంబారావు, పశువైద్య సిబ్బంది, గోపాలమిత్ర సిబ్బంది పాల్గొన్నారు.