tharupalli | కాల్వ శ్రీరాంపూర్, మార్చి 26 : కాల్వ శ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని తారుపల్లిలో పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు టీకాలు వేసి మందులు పంపిణీ చేశారు. జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి హాజరై మాట్లాడుతూ పశువైద్య శిబిరాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పశువులకు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, పశు వైద్యాధికారి డాక్టర్ సురేష్ , ఏఎంసీ వైస్ చైర్మన్ రాజమల్లు, డైరెక్టర్లు, మాజీ సర్పంచులు, పశువైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.