Dharmaram | ధర్మారం, డిసెంబర్ 24: పెద్దపల్లి జిల్లా ధర్మారం ధర్మారం మండల కేంద్ర వాస్తవ్యులైన బొమ్మవరం వేణు గోపాల్ రావు రాష్ట్రస్థాయి యోగాసనాలలో విజేతగా నిలువగా ఆయనను బుధవారం స్థానిక సలాంద్రి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, అలయన్స్ క్లబ్ సభ్యులు, యోగా సేవా సమితి సభ్యులు సన్మానించారు.
రాష్ట్రంలో ఈనెల 21న రాష్ట్రవ్యాప్త యోగా పోటీలను నిర్వహించగా ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో యోగాసనాల పోటీలను నిర్వహించారు. సూర్య నమస్కారాలతో పాటు పలు యోగాసనాలు వేసి వేణుగోపాల్ రావు ప్రథమ స్థానం సాధించి విజేతగా నిలిచారు. దీంతో స్థానికులు వేన్ గోపాల్ రావును సన్మానం చేసి అభినందించారు.