హుజురాబాద్ : స్వయంభూ శ్రీమత్స్యగిరీంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలను( Brahmotsavam )విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్ సారాబుడ్ల వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ బిల్ల రాజిరెడ్డి కోరారు. గురువారం మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో గల స్వయంభూ శ్రీమత్స్యగిరీంద్రస్వామి వారి పంచాహ్నిక బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ చైర్మన్ సారబుడ్ల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రతులను ఆలయం వద్ద విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 7వ తేదీ శుక్రవారం ఉదయం 6: 30నిమిషాలకు అభిషేకం, శనివారం రోజున 11:45 నిమిషాలకు స్వామి వారుల కళ్యాణ మహోత్సవం,12 వతేదిన బుధవారం పౌర్ణమి శకటోత్సవం(బండ్లు తిరుగుట)13 వతేదీన గురువారం సాయంత్రం 6గంటలకు నాకబలి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో చైర్మన్ సారబుడ్ల వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ బిల్ల రాజిరెడ్డి, కొంపెల్లి సుధాకర్ రెడ్డి, కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, కారోబార్ అయిత రాజేందర్, కొంపెల్లి తిరుపతి రెడ్డి, వెన్నం భగవాన్ రెడ్డి, పైడిపల్లి లింగయ్య, పైడిపల్లి కుమారస్వామి, గ్రామస్తులు, ఆలయ కమిటీ పాలకవర్గం పాల్గొన్నారు.