పెగడపల్లి : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం వెంగళాయిపేట ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు సరిత జగిత్యాల జిల్లా స్థాయి టీఎల్ఎం మేళాలో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. జిల్లా స్థాయి టీఎల్ఎం మేళాలో ప్రతిభ కనబర్చిన సరిత, జిల్లా విద్యాధికారి రాము చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. ఈ మేరకు ఆమె రాష్ట్రస్థాయికి ఎంపిక అయినట్లు మండల వైద్యాధికారి సులోచన తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్రస్థాయికి ఎంపికైన ఉపాధ్యాయురాలు సరితను మండల విద్యాధికారి సులోచన పెగడపల్లి పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు లలిత అభినందించి, సన్మానం చేశారు. అనంతరం మండల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందిస్తూ రాష్ట్రస్థాయిలో కూడా సరిత విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.