Vemulawada | సమస్యలు పరిష్కరించాలని వేములవాడ నాయి బ్రాహ్మణుల ఆందోళన.. సంప్రదింపులు జరిపిన రాజన్న ఆలయ అధికారులు
వేములవాడ రాజన్న ఆలయ రెండవ కళ్యాణ కట్టలో విధులు నిర్వహించే నాయి బ్రాహ్మణులు శనివారం తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. తాము గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి జీతభత్యాలు లేకుండానే రెండవ కళ్యాణకట్టలో పనిచేస్తున్నామని తెలిపారు.
Vemulawada | వేములవాడ, సెప్టెంబర్ 19 : వేములవాడ రాజన్న ఆలయ రెండవ కళ్యాణ కట్టలో విధులు నిర్వహించే నాయి బ్రాహ్మణులు శనివారం తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. తాము గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి జీతభత్యాలు లేకుండానే రెండవ కళ్యాణకట్టలో పనిచేస్తున్నామని తెలిపారు. భక్తులు ఇచ్చే కానుకల మీదే ఆధారపడి తాము పనిచేస్తుండగా రెండు రోజుల క్రితం వరంగల్ జిల్లాకు చెందిన భక్తులు అడగకముందే ఇచ్చిన నగదును తాము బలవంతంగా వసూలు చేశారన్న నేపాన్ని సంబంధిత అధికారి ఈవో దృష్టికి తీసుకెళ్లి తమకు ఒక్కొక్కరికి 15వేల రూపాయల జరిమానా విధించారని వాపోయారు. అయితే తాము ఎవరిని బలవంతంగా డబ్బులు అడగడం లేదని ఇస్తే తీసుకుంటున్నామని లేదంటే ఊరుకుంటున్నామని చెప్పారు.
తమకు కూడా ఇబ్బందిగా ఉన్నందున మొదటి కళ్యాణ కట్టలో పనిచేసే నాయి బ్రాహ్మణుల తరహాలో కమిషన్, లేదంటే వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించారు. దీంతో రాజన్న ఆలయ ఏఈవో మహేష్, పర్యవేక్షకుడు శ్రీనివాస్ శర్మ, వంశీ మోహన్ తో పాటు రెండవ కళ్యాణ కట్టను పర్యవేక్షిస్తున్న కాంట్రాక్టర్ సంబంధించిన వారు వచ్చి సంప్రదింపులు జరిపారు. సమస్యలు పరిష్కరించేందుకు రెండు రోజుల గడువు కోరినందున తాము యధావిధిగా విధులు నిర్వహిస్తామని నాయి బ్రాహ్మణులు నరసయ్య, లక్ష్మణ్, తిరుపతి, శ్రీశైలం, దామోదర్ తదితరులు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
Stock Market | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. 1534 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఒక్కరోజే 2 శాతంపైగా లాభం
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

