Pat Cummins | కోహ్లీ, రోహిత్ కాదు.. భారత జట్టులో ‘టఫ్ బ్యాటర్’ అతడే..!
Pat Cummins : భారత క్రికెటర్లలో ఎవరికి బౌలింగ్ చేయడం కష్టం? అని అడగ్గానే.. విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) అని టక్కున చెప్పేస్తారు ఎవరైనా. కానీ, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) మాత్రం వీరిద్దరు కాదంటున్నాడు.
Pat Cummins : భారత క్రికెటర్లలో ఎవరికి బౌలింగ్ చేయడం కష్టం? అని అడగ్గానే.. విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) అని టక్కున చెప్పేస్తారు ఎవరైనా. కానీ, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) మాత్రం వీరిద్దరు కాదంటున్నాడు. ఇటీవల కమిన్స్ మాట్లాడుతూ తనకు సవాల్ విసిరిన భారత క్రికెటర్ పేరును ఇటీవల వెల్లడించాడు. తన సుదీర్ఘ కెరీర్లో పలుదేశాల నుంచి సవాల్ విసిరిన ఆటగాళ్ల గురించి చెప్పిన ఆసీస్ సారథి.. టీమిండియాతో మ్యాచుల్లో విరాట్, హిట్‌మ్యాన్ కాకుండా తనను ఛతేశ్వర్ పుజారా(Chateshwar Pujara) ఎక్కువగా ఇబ్బంది పెట్టాడని తెలిపాడు.
భారత క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లు చాలామందే ఉన్నారు. వరల్డ్ క్లాస్ బ్యాటింగ్ విన్యాసాలతో మేటి బౌలర్లను గడగడ వణికించిన వారికి కొదవలేదు. అయితే.. వీరిలో టన్నుల కొద్ది పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అందరికంటే కాస్త ముందు వరసలో ఉంటారనుకుంటాం. ఎందరో బౌలర్లపై పైచేయి సాధించిన ఈ ఇద్దరు తనను అంతగా ఇబ్బంది పెట్టలేదని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అంటున్నాడు. భారత్ విషయానికొస్తే.. తనను అత్యంత కష్టపెట్టింది మాత్రం ఛతేశ్వర్ పుజారా అని కమిన్స్ అన్నాడు.
Pat Cummins has seriously rubbed shoulders with cricketing greatness in his career 🤩🏏#PatCummins #ChrisGayle #ABDeVilliers #Cricket #UniverseBoss pic.twitter.com/11COv9WIFa
— Prime Video Sport AUNZ (@pvsportaunz) September 18, 2026
తాజాగా ప్రైమ్ వీడియో స్పోర్ట్స్ అంజ్లో మాట్లాడిన ప్యాటీ .. పుజారా పట్టుదల, అంకితభావం అమోఘమని, అందుకే అతడిని ఔట్ చేయడం కష్టంగా తోచేదని పేర్కొన్నాడు. టీమిండియాలో పుజారాను ఔట్ చేయడం చాలా కష్టం. అతడు నా వ్యూహాలను చిత్తు చేసేవాడు. అతడు అనుకుంటే సంతోషంగా 100 డాట్ బాల్స్ ఆడేవాడు. అంతేతప్ప ప్రత్యర్థి బౌలర్లకు ఒక్క అవకాశం కూడా ఇచ్చేవాడు కాదు అని కమిన్స్ వెల్లడించాడు.
కుక్, డివిలియర్స్..
అలానే వివిధ దేశాల జట్లలో తనకు సవాల్ విసిరిన, తాను ఫిదా అయిన క్రికెటర్ల పేర్లను ఆసీస్ కెప్టెన్ ఈ వీడియోలో చెప్పాడు. మూడు ఫార్మాట్ల కెరీర్లో బ్రెండన్ మెక్కల్లమ్(న్యూజిలాండ్), తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక), అలెస్టర్ కుక్(ఇంగ్లండ్), ఏబీ డివిలియర్స్(దక్షిణాఫ్రికా), క్రిస్ గేల్ (వెస్టిండీస్)లు తనను ఇబ్బంది పెట్టారని కమిన్స్ వివరించాడు. ఇక పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ ఓవర్లో ఆఖరి బంతికి తాను క్లీన్‌బౌల్డ్ అవ్వడం తనకింకా గుర్తుందని కమిన్స్ అన్నాడు. అక్టోబర్ 9న దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతున్నాడీ వెటరన్ పేసర్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

