Bhutan | భూటాన్‌లో భూకంపం.. 4.9 తీవ్రతతో కంపించిన భూమి.. అసోంలోనూ ప్రకంపనలు
Bhutan : భూటాన్‌లో శనివారం భూకంపం సంభవించింది. 4.9 తీవ్రతతో భూమి కంపించింది. భూకంపాల తీవ్రతను కొలిచే నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ (ఎన్సీఎస్) ఈ వివరాల్ని వెల్లడించింది.
Bhutan : భూటాన్‌లో శనివారం భూకంపం సంభవించింది. 4.9 తీవ్రతతో భూమి కంపించింది. భూకంపాల తీవ్రతను కొలిచే నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ (ఎన్సీఎస్) ఈ వివరాల్ని వెల్లడించింది. దీని ప్రకారం.. భూటాన్ ఈశాన్య ప్రాంతంలో శనివారం సాయంత్రం 4.01 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత 4.9గా నమోదైంది.
గ్యెల్ఫోలంగ్కు 3 కిలోమీటర్ల దూరంలో, 5 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉంది. ఈశాన్య భూటాన్‌లోని అనేక ప్రాంతాల్లో ఈ భూకంపం నమోదైంది. అలాగే, సరిహద్దులో ఉన్న అసోంలోనూ కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనాలు వచ్చాయి. దీంతో అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇటు భూటాన్‌లోనూ, అటు అసోంలోనూ నష్టానికి సంబంధించి ఎలాంటి వివరాలు నమోదు కాలేదు. ఈ భూకంపానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతానికి తీవ్ర నష్టం నమోదు కాకపోయినప్పటికీ.. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నట్లు భూటాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు మూడు రోజుల క్రితం నేపాల్‌లో కూడా మరోసారి భూకంపం నమోదైన సంగతి తెలిసిందే. నేపాల్‌లో తాజాగా 4.5 తీవ్రతతో భూకంపం నమోదు కాగా.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : టీటీడీ అదనపు ఈవో
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

