అన్ని వర్గాలకు సమన్యాయం
అన్నివర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజపల్లిలో రజక సంఘ భవనాన్ని ప్రారంభించి, మాట్లాడారు.
- ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడ రూరల్, ఫిబ్రవరి 4: అన్నివర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజపల్లిలో రజక సంఘ భవనాన్ని ప్రారంభించి, మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలందరికీ సమన్యాయం కల్పించడంతో ప్రాధాన్యత ఇస్తామన్నారు. గ్రామంలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రజక సంఘ భవనాన్ని ప్రారంభించారు.
ఇక్కడ కౌన్సిలర్ సంగ హన్మవ్వ, వేములవాడ పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి, రజక సంఘం అధ్యక్షులు లింగంపల్లి గంగయ్య, వనపర్తి మహేందర్, దశరథం, లింగయ్య, లక్ష్మీరాజం, అంజయ్య, నాయకులు సంగ స్వామియాదవ్, సదానందం, రాజేశం, కిరణ్, మనోజ్, తదితరులు ఉన్నారు. అలాగే వేములవాడ పట్టణానికి చెందిన రుద్ర చిట్‌ఫండ్ వారు రూపొందించిన క్యాలెండర్‌ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఇక్కడ డైరెక్టర్ మాదిరెడ్డి వెంకటరమణరెడ్డి, మాజీ కౌన్సిలర్ తూం మధు, ఇల్లంతకుంట గణేశ్, కొడం గంగాధర్ తదితరులు ఉన్నారు.
సామాజిక సేవకు గుర్తింపు
వేములవాడ, ఫిబ్రవరి 4: సామాజిక సేవకు తగిన గుర్తింపు ఉంటుందని ప్రభు త్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నా రు. ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం అధ్యక్షుడు దివంగత ఏగిన మురళి కాంస్య విగ్రహాన్ని నిత్యాన్నదాన సత్రం ఆవరణలో ఆదివారం ఆవిషరించి, మాట్లాడారు. 37 ఏండ్ల క్రితం సత్రం నిర్మించి వేలాది మందికి అన్నదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఇక్కడ వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం అధ్యక్షుడు బుస్స శ్రీనివాస్, పట్టణాధ్యక్షు డు రేణికింది శ్రీనివాస్, నాయకులు ఏగిన శ్రీనివాస్, దశరథం, కిషన్, కటూరి శ్రీనివాస్, నగుబోత్ రవి, కొత్తపల్లి శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 4: క్రీడలు శారీరక ధృడత్వంతోపాటు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని ప్రభుత్వ విప్ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్ పేరొన్నారు. తంగళపల్లి మండలం రాళ్లపేటలో ఏర్పాటు చేసిన ప్రీమియర్‌లీగ్ క్రికెట్ పోటీలను ఆ యన ప్రారంభించారు. అనంతరం ఫ్రెండ్ క్లబ్ అధ్యక్షుడు ఎడమల శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో విప్‌ను సన్మానించారు. ఇక్కడ సభ్యులు సామల గణేశ్, శంకర్, శ్రీనివా స్, భూపతి, శివప్రసాద్,రాజు, సత్యనారా యణరెడ్డి, చందు, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

