Kranti Gaud | పుట్టినరోజున సర్ప్రైజ్.. వరల్డ్కప్ విజేతకు పాండ్యా ప్రత్యేక కానుక.. !
Kranti Gaud : భారత మహిళల జట్టు ఆల్రౌండర్ క్రాంతి గౌడ్(Kranti Gaud) ప్రత్యేక కానుక అందుకుంది. అది కూడా తన ఫేవరెట్ ఆటగాడైన హార్దిక్ పాండ్యా(Hardik Pandya) చేతుల మీదుగా.
Kranti Gaud : భారత మహిళల జట్టు ఆల్రౌండర్ క్రాంతి గౌడ్(Kranti Gaud) ప్రత్యేక కానుక అందుకుంది. అది కూడా తన ఫేవరెట్ ఆటగాడైన హార్దిక్ పాండ్యా(Hardik Pandya) చేతుల మీదుగా. మంగళవారం ఈ పేసర్ పుట్టిన రోజును పునస్కరించుకొని బెంగళూరులో తన 33వ నంబర్ జెర్సీని బహూకరించాడు పాండ్యా. తాను స్ఫూర్తిగా భావించే ఆటగాళ్లలో ఒకడైన హార్దిక్ నుంచి బర్త్ డే నాడు జెర్సీ అందుకోవడంతో తెగ సంబురపడిపోయిందీ వరల్డ్ కప్ విజేత.
ఇటీవల ఇంగ్లండ్పై సంచలన ప్రదర్శనతో లార్డ్స్ హానర్స్ బోర్డులో పేరు సంపాదించిన క్రాంతి గౌడ్.. వసంతంలో అడుగుపెట్టింది. మంగళవారం ఆమె పుట్టిన రోజు కావడంతో భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆమెకు ప్రత్యేక కానుక ఇచ్చాడు. తన అభిమాన క్రికెటర్ జెర్సీని బహూకరించడంతో క్రాంతి ఆనందానికి హద్దుల్లేవనుకో. పాండ్యా తనకు జెర్సీ అందించిన ఫొటోను సోషల్ మీడియాలో వెల్లడించిందీ పేసర్.
A special moment for Kranti Gaud as she receives a signed jersey from Hardik Pandya. 👕 pic.twitter.com/ljo6qd01kQ
— Circle of Cricket (@circleofcricket) August 17, 2026
‘హార్దిక్ పాండ్యా నా ఐడల్. నేను అతడిలా గొప్ప క్రికెటర్ అవ్వాలనుకుంటున్నా’ అని ఈ ఏడాది వీడియోలో పేర్కొన్న క్రాంతి.. తాను కలగన్నట్టే పాండ్యాను కలిసి మురిసిపోయింది. ఇటీవల నిలకడగా రాణిస్తూ టీమిండియా విజయాల్లో కీలకమవుతున్న క్రాంతి.. ఆసియా కప్, ఆసియా క్రీడల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

