Vemulawada | వేములవాడ, జనవరి 25: సూపర్ స్పెషాలిటీ వైద్య విద్య ప్రవేశ పరీక్షలో వేములవాడ వైద్యురాలు డాక్టర్ ఉడుతల లిఖిత ఆల్ ఇండియా 3వ ర్యాంక్ సాధించారు. వేములవాడ పట్టణానికి చెందిన ఉడతల వెంకన్న విజయ దంపతుల రెండో కూతురు లిఖిత ఎంబీబీఎస్ గాంధీ ఆసుపత్రిలో పూర్తి చేశారు.
పీజీ ఎండీని కూడా గాంధీలోనే పూర్తి చేయగా గోల్డ్ మెడల్ సాధించారు. ఊపిరితిత్తుల విభాగంలో వైద్య సేవలు అందించాలని నీట్ సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్ష హాజరుకాగా శనివారం విడుదలైన ఫలితాలలో ఆల్ ఇండియా మూడో ర్యాంకు సాధించగా వైద్యురాలని పలువురు అభినందించారు.