 
                                                            Antargaom | అంతర్గాం, అక్టోబర్ 31 : అంతర్గాం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా వేముల సుమలత శుక్రవారం విధుల్లో చేరి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల గ్రూపు-1 ఫలితాల్లో 609 ర్యాంకు సాధించిన సుమలత వేములను పెద్దపల్లి జిల్లాకు కేటాయించారు. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అంతర్గాం ఎంపీడీవోగా నియమించగా విధుల్లో చేరారు.
ఇక్కడ ఇంచార్జ్ ఎంపీడీవోగా విధులు నిర్వహించిన వేణు మాధవ్ తిరిగి మండల పంచాయతీ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో చేరిన ఎంపీడీవోకు కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
 
                            