కరీంనగర్ కలెక్టరేట్ ఎంట్రెన్స్ వాహన పార్కింగ్‌కు అడ్డాగా మారిపోయింది. ప్రధాన ద్వారం ఎదుట నో పార్కింగ్ బోర్డులు, బ్యానర్లు ఉన్నా వాహనదారులు ఇష్టారాజ్యంగా వెహికిల్స్ పార్క్ చేస్తుండగా, లోపలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతున్నది.
వాహనాలు నిలిపేందుకు పక్కనే ఉన్న చెట్ల కింద ఖాళీ స్థలం చదును చేసినా, ప్రధాన ద్వారం ఎదుట పార్క్ చేస్తుండడంతో ప్రభుత్వ విభాగాలకు వచ్చే ప్రజలు, ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. వాహనాలు నిలుపకుండా చూడాలని కోరుతున్నారు.
– కరీంనగర్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్