Brain Stroke | మంథని, జనవరి 11 : మంథని పట్టణంలోని బోయినిపేటకు చెందిన కూరగాయల వ్యాపారి మనోహర్(42) అనే వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. గత రెండు రోజులుగా జ్వరం, తల నొప్పితో బాధపడుతున్న మనోహర్ ఆదివారం ఆసుపత్రికి వెళ్లి ఇంటికి వచ్చిన తరువాత బ్రెయిన్ స్టోక్ వచ్చి హఠాత్తుగా మృతి చెందాడు.
మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఏన్నో ఏళ్లుగా మంథనిలోని కూరగాయల మార్కెట్లో కూరగాయాలు విక్రయిస్తున్న మనోహర్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.