PhD degree | వీర్నపల్లి , ఆగస్టు 20: వీర్నపల్లి మండలకేంద్రానికి చెందిన సామల్ల కృష్ణ ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. పదేళ్ల క్రితమే శబ్ధ తరంగాల అలజడిలో జరిగే వెయ్యో వంతు శబ్ధాన్ని పసిగట్టే అల్గారిథమ్ రూపొందించారు. ఈ పరిశోధనతో సిగ్నల్ ట్రాన్స్ మిషన్ లో పెను మెరుపులకు దారి తీయగా డాక్టరేట్ పొందారు.
తాజాగా నావిగేషన్ ఎలక్ట్రానిక్స్ పైన పరిశోధన చేసినందుకు గాను 84వ ఉస్మానియా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణు దేవా వర్మ, ఇస్రో చైర్మన్ నారాయణన్ చేతుల మీదుగా ఉత్తమ పీహెచ్డీ పట్టాను అందుకున్నాడు. ఈ సందర్బంగా కృష్ణ మాట్లాడుతూ తన పరిశోధనలకు గ్రామీణ నేపథ్యమే బలమైన కారణమని తెలిపారు.