Jagityal | జగిత్యాల, జూలై 16 : జిల్లా కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వీరమ్మ తల్లి ఎత్తుకొని శోభాయాత్ర పట్టణ వీధుల గుండా బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని సాంప్రదాయ పద్ధతిలో వీరమ్మ తల్లి బోనాన్ని వార్డులోని మహిళలు ఇంటింటి నుండి బోనాన్ని ఎత్తుకొని పట్టణ వీధుల గుండా డప్పు చప్పుళ్ల మధ్య భక్తి పాటలతో జగిత్యాలలో వార్డులన్నీ మారుమోగాయి.
ఈ వీరమ్మ తల్లి బోనాల సందర్భంగా శ్రీ మడలేశ్వర స్వామి వారి విగ్రహాన్ని తయారుచేసి వీరమ్మ తల్లి బోనాల శోభాయాత్రలో నిర్వహించారు. జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ దావా వసంత ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళలతో కలిసి బోనాలు ఎత్తుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ విగ్రహాన్ని చూడడానికి పట్టణంలోని ప్రజలు ఆసక్తిగా చూశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ కుల బంధువులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.