veenavanka | వీణవంక, ఏప్రిల్ 3 : వీణవంక మండల శాలివాహన సంఘం నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మండల అధ్యక్షుడిగా మందారపు నరేష్, ఉపాధ్యక్షులుగా కొలిషెట్టి మొండయ్య, నల్లవెల్లి సంపత్, ప్రధాన కార్యదర్శిగా తాటికంటి తిరుపతి, కార్యదర్శులుగా ఇజిగిరి నరేష్, సిలివేరి విజయ్ ను ఆ సంఘం నాయకులు ఏకగ్రీవంగా ఎన్నికున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా కమిటీని మాజీ అధ్యక్షులు శ్రీనివాస్, కులసంఘం నాయకులు శాలువాలతో సన్మానించారు. శాలివాహన సంఘం అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శాలివాహన సంఘం నాయకులు పాల్గొన్నారు.