వృద్ధులేం పాపం చేసిన్రు?
‘వృద్ధులు, బీడీ కార్మికుల నుంచి పింఛన్ దరఖాస్తులు ఎందుకు స్వీకరించడం లేదు.. వారేం పాపం చేసిన్రు?’ అంటూ కాంగ్రెస్ సర్కారును జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత నిలదీశారు.
- వారికి పింఛన్లు ఎందుకివ్వరు
- బీడీ కార్మికులను సర్కారు విస్మరిస్తున్నది
- పింఛన్లపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలి
- జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత
- హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందంటూ ఆగ్రహం
సారంగాపూర్, ఆగస్టు 14: ‘వృద్ధులు, బీడీ కార్మికుల నుంచి పింఛన్ దరఖాస్తులు ఎందుకు స్వీకరించడం లేదు.. వారేం పాపం చేసిన్రు?’ అంటూ కాంగ్రెస్ సర్కారును జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత నిలదీశారు. ఎన్నికల సమయంలో అన్ని వర్గాలకు పింఛన్లు పెంచి ఇస్తామని ప్రకటించి, ఇప్పుడేమో వితంతు, ఒంటరి మహి ళ, చేనేత, గీత, డయాలసిస్, పైలేరియా బాధితుల నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరించడమేంటని ప్రశ్నించారు.
రేవంత్‌రెడ్డి సర్కారు వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా పింఛన్లపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సారంగాపూర్ మండలం రేచపల్లిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ రాకముందు రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2,016కు పెంచిన ఘనత తొలి సీఎం కేసీఆర్‌దేనన్నారు. ఎన్నికల సమయంలో అర్హులందరికీ రూ.4వేల పింఛన్లు ఇస్తామని, 18 ఏండ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిన హామీ నేటికి అమలుకు నోచుకోవడం లేదన్నారు.
ప్రజాపాలన గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. ఇప్పుడు మళ్లీ పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ప్రతి మండల కేంద్రంలో సదరం క్యాంపులు ఏర్పాటు చేసి అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలన్నారు. ప్రజలను అతి తక్కువ సమయంలో మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని విమర్శించా రు. హామీలు అమలు చేయనందుకు రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు కూడా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు తేలు రాజు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సాగి సత్యంరావు, నాయకులు కొండ్ర రాంచందర్‌రెడ్డి, ఒడ్నాల జగన్, సాతాల్ల రమేశ్, శ్రీనివాస్, బందెల రమేశ్, బేర మహేశ్, బుచ్చిరెడ్డి, పడిగెల గంగారెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

