తిమ్మాపూర్, సెప్టెంబర్13: కరీంనగర్ తిమ్మాపూర్ మండలంలో ఎల్ఎండీలో (LMD) మత్స్యకారులకు వింత చేప చిక్కింది. తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన బోళ్ల భూమయ్య అనే మత్స్యకారుడు చేపలు పట్టేందుకు వెళ్ళారు. ఈ క్రమంలో తన వలలు తీస్తుండగా ఎర్ర రంగులో ఉన్న భారీ చేప కనిపించింది. దీంతో ఒడ్డుకు చేర్చి తోటి మత్స్యకారులకు చూపించారు. ఇలాంటి చేప ఇప్పటివరకు ఎల్ఎండీ రిజర్వాయర్‌లో పడలేదని మత్స్యకారులు తెలిపారు. ఇది ఉత్తరప్రదేశ్‌కు చెందిన చేపగా పలువురు చెబుతున్నారు. ఈ వెరైటీ చేపను గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు.