special pujas | సుల్తానాబాద్ రూరల్, ఆగస్టు 8: శ్రావణమాసం పర్వదిరాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని శుక్రవారం వైభవంగా జరిపించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామంలోని పార్వతీ మహాదేవ స్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని అర్చకులు ఊటుకూరు శంకర్ శర్మ, మహాదేవ శర్మ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని సామూహిక వరలక్ష్మి పూజతోపాటు కుంకుమార్చన తదితర కార్యక్రమాలను నిర్వహించారు. పూజ అనంతరం మహిళలు ఒకరికొకరు వైనాలను ఇచ్చుకున్నారు. ఆలయ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న మండపానికి ఓదెల మండలం గుండ్లపల్లికి చెందిన రజిత జయప్రకాష్ రెడ్డి రూ.70 వేల విరాళాలు ఇచ్చినట్లు అర్చకుడు శంకర్ శర్మ తెలిపారు. పూజల అనంతరం భక్తులకు అన్నదానం చేసినట్లు పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన దంపతులను ఘనంగా సన్మానం చేశారు.