Gangadhara | గంగాధర, అక్టోబర్ 7 : స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న భారతీయుల గుండెల్లో వందేమాతర గేయం ఉద్యమ స్ఫూర్తిని నింపిందని మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో దమ్మని రాము, తహసీల్దార్ అంబటి రజిత అన్నారు. వందేమాతర గేయాన్ని రచించి 150 ఏళ్లు గడిచిన సందర్భంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు శుక్రవారం గంగాధర మండల కేంద్రంలో వందేమాతరం గేయాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు, విద్యార్థులు, ప్రజలు మానవహారంగా ఏర్పడి వందేమాతర గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా స్వతంత్ర ఉద్యమ కాలంలో బంకిన్చంద్ర చటర్జీ వ్రాసిన వందేమాతర గేయం ప్రజల హృదయాల్లో స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని ఏ విధంగా నింపిందో, ఉద్యమ స్ఫూర్తితో భారతదేశానికి స్వాతంత్రం ఎలా సిద్ధించిందో అధికారుల విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీఓ గౌరీ రమేష్, ఆర్ఐలు రజినీకాంత్ రెడ్డి, సంతోష్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి లచ్చయ్య, నాయకులు పడాల రాజన్న, గంగాధర ప్రవీణ్, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.