Pegadapally | పెగడపల్లి: పెగడపల్లి మండలం నామాపూర్ లో బుధవారం మండల పశువైద్య శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మండల పశు వైద్యాధికారి హేమలత మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న ఈ టీకాలను పశువులకు తప్పనిసరిగా వేయించాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది మతిన్, వినిత్, జానిపాషా, గ్రామ రైతులు పాల్గొన్నారు.