Urea production | ఫర్టిలైజర్ సిటీ, జూన్ 15 : వార్షిక మరమ్మతులు నిమిత్తం షట్ డౌన్ తీసుకున్న రామగుండం ఎరువుల కర్మాగారం లో ఆదివారం యూరియా ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రతీ ఏటా మే లో నెల రోజులపాటు కర్మాగారాన్ని షట్ డౌన్ తీసుకొని మరమ్మతులు చేయటం అనవాయితీగా వస్తుంది. అయితే ఈ ఏడాది సుమారు 8 రోజులపాటు ఆలస్యమైనా ఉత్పత్తి ప్రారంభం అయింది.
అయితే యూరియా ఉత్పత్తు లో కీలకమైన క్యాటలిస్ట్ రాక ఆలస్యం తో ఉత్పత్తి ఆలస్యo అయినట్టు తెలుస్తోంది.రోజుకు 2200 మెట్రిక్ టన్ను ల అమ్మోనియా , 3850 మెట్రిక్ టన్ను ల యూరియా ఉత్పత్తి ,సంవత్సరానికి 12.7 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం గా కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 12,2022 లో కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు.అప్పటినించి కర్మాగారం 2022-23 లో 8.40 లక్షల మెట్రిక్ టన్నులు ,2023-24 లో 11.95 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ను ఉత్పత్తి చేసి తెలంగాణ కు యూరియా అందించటం లో తనదైన శైలిలో కృషిచేస్తోంది.ఖరీఫ్ సీజన్ లో తెలంగాణకు ప్రతీయేటా ఖరీఫ్ సీజన్ లో 9.50లక్ష ల టన్నుల యూరియా అవసరం ఉంటుంది.
అయితే ఆర్ ఎఫ్ సి ఎల్ యూరియా ఉత్పత్తి లో 40 శాతం ప్రతియేటా తెలంగాణకు అంటే సుమారు 3.50 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తుంది.తమిళనాడు,ఏ పి,కర్ణాటక,మహారాష్ట్ర ,ఛత్తీష్ఘడ్,మద్యప్రదేశ్ రాష్ట్రాలకు ప్రతి ఏటా 10 శాతం సరఫరా చేయాల్సి ఉంది.అయితే తెలంగాణ లక్ష్యం లో ఇప్పటికే మార్కెట్ లో 1 లక్ష మెట్రిక్ టన్నులు సరఫరా చేసి ఉండగా మరో 2.50 లక్షల టన్నులు యూరియా సరఫరా చేయాల్సి ఉంది.
ఎట్టకేలకు యూరియా ఉత్పత్తి ప్రారంభం కావటం తో తెలంగాణ కు ఖరీఫ్ లో పూర్తి స్థాయిలో యూరియా అందుబాటులో కి రానుంది. దీంతో రైతాంగం హర్షం వ్యక్తమ్ చేస్తున్నారు .ఐతే కర్మాగారం లో వార్షిక ఉత్పత్తి లక్ష్యం లో కేవలం 24 లక్షల టన్నులయూరియా మాత్రమే ఉత్పత్తి చేసింది .