Urea | సైదాపూర్, కరీంనగర్ : సైదాపూర్ మండలంలోని వెన్నెంపల్లి సహకార సంఘానికి బుధవారం 450 యూరియా బస్తాలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న రైతులు గురువారం ఉదయం సుమారు 4 గంటలనుండి క్యూ కట్టారు. యూరియా కొరత తో రైతున్నలు ఉదయం నుండే లైన్ కట్టారు. సహకార సిబ్బంది వచ్చి యూరియాను పంపిణీ చేస్తున్నారు. ఒక్కో రైతుకు రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు.
రెండు యూరియా బస్తాలు తీసుకున్న రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవసరమున్న యూరియా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి యూరియా అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు.