Urea distribution | కోరుట్ల రూరల్, ఆగస్టు 4: పోలీసుల పహారా మధ్య కోరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ఆధ్వర్యంలో యూరియాను సోమవారం పంపిణీ చేశారు. ఈ మేరకు సహకార సంఘానికి 450 యూరియా బస్తాలు రాగా ఎలాంటి గోడవలు జరుగకుండా ముందస్తుగా పోలీసుల పహారా మధ్య యూరియాను రైతులకు పంపిణీ చేశారు.
రైతులు ఆధార్‌కార్డు, పట్టాపాస్ బుక్ జిరాక్సులతో వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు అందించగా, ఆన్లైన్లో నమోదు చేసుకోని ఎకరానికి ఒక బస్తా చొప్పున సుమారు 80మంది రైతులకు పంపిణీ చేశారు. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో యూరియా ఎలాంటి కొరత లేకుండా రైతులకు పంటల అవసరం మేరకు ముందస్తు గోదాముల్లో ఎరువులు నిల్వలు చేసి పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వలో రైతులు పోలీసుల పహారా మధ్య యూరియాను తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఈ యూరియా కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే గాని దొరకని పరిస్థితి ఏర్పడింందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.