పెద్దపల్లి, మార్చి 16(నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. కరీంనగర్‌తో పాటు పెద్దపల్లి జిల్లాలో భారీగా పడింది. సాయంత్రం గాలి దుమారం, ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది.
గంటపాటు ఎడతేరిపి లేకుండా వర్షం కురువడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. దీంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. పలు మండలాల్లో మామిడి కాయలు రాలిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు, రోడ్లన్నీ జలమయమయ్యా యి. అకాల వర్షంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.