Senior Baseball Competition | పాలకుర్తి: గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాల మైదానంలో ఈ నెల 10న జిల్లా బేస్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీల్లో యూనివర్సల్ స్కూల్ విద్యార్డులు ఎంపికయ్యారు.
పాఠశాలకు చెందిన కె రాంచరణ్ , బీ సాయి గణేష్ , ఎన్ హర్షిత్ అద్భుతమైన ప్రతిభ కనబరిచి ఈ నెల 16 నుంచి 18 వరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు సంతోష్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మొహమ్మద్ ఇస్మాయిల్, ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ అఫ్జల్ గార్లు విద్యార్థులని అభినందించారు.